ఆపస్తంబగృహ్యసూత్రసమీక్షణం – పరిభాషాప్రకరణం

పురోహితులు, స్మార్తపండితులు, వేదపండితులు, ఆగమపండితులు, ఉత్తమానుష్ఠాతల కొరకు ఆపస్తంబమహర్షి చేత ఉపదేశింపబడిన గృహ్యసూత్రములయొక్క పరిభాషాప్రకరణమును ఈ పాఠ్యాంశ తరగతుల ద్వారా తెలుసుకొనగలరు. 

కోర్సు ముఖ్యోద్దేశ్యము

వైదికజీవనంలో ఆసక్తి ఉన్న ఆస్తికులందరూ వారి వారి సంప్రదాయాలను అనుసరిస్తూ., గురూపదేశములను అనుసరిస్తూ ఆచారవ్యవహారము కొనసాగిస్తూ ఉంటారు. సమాజమును ఇట్టి సంప్రదాయాలయందు, ఆచారవ్యవహారములయందు మార్గనిర్దేశము చేస్తూ గురుస్థానమును అలంకరిస్తున్న వారిని గురువుగారు అని, అయ్యగారు అని గౌరవంతో పిలుస్తుంటాము. అట్టి పురోహితులను, స్మార్తపండితులను, వేదపండితులను, ఆగమపండితులను, ఉత్తమానుష్ఠాతలను దృష్టిలో పెట్టుకొని ఆపస్తంబమహర్షి చేత ఉపదేశింపబడిన గృహ్యసూత్రములయొక్క పరిభాషాప్రకరణమును సహజసులభమైన తెలుగుభాషలో అనేకధర్మశాస్త్రములను అధ్యయనం చేసిన స్మార్తవిద్యలో నిష్ణాతులైన బ్రహ్మశ్రీ డా॥ ముష్టి పవన కుమార శర్మగారు బోధించారు. ఈ పాఠాలముద్రణలను మీకు కుదిరిన సమయమున చూసి అపూర్వవిషయములను నేర్చుకొనవచ్చును.

సమీక్ష

  • చతుర్దశవిద్యాస్థానముల పరిచయము
  • నాలుగువేదములు-కల్పసూత్రముల పరిచయము

నిర్వచనం-వివరణ

  • గృహ్యం అంటే ఏమిటి?
  • సూత్రము అంటే ఏమిటి?
  • కర్మ అంటే ఏమిటి? ఆచారం అంటే ఏమిటి? అవి ఎన్ని విధములు?
  • కల్పసూత్రములు వేదప్రమాణములా?
  • అధికరణం వివరణ

ప్రధానాంశములు

  • గృహ్యసూత్రముల ఆరంభసూత్రములు
  • ప్రతిజ్ఞాసూత్రమ్
  • ఉదగయనాదికాలవిధిః
  • యజ్ఞోపవీతప్రాదక్షిణ్యాదివిధిః
  • పిత్ర్యాణామపరపక్షాదివిధిః
  • శ్రౌతగృహ్యసూత్రములు
  • సామయాచారికధర్మములు

Register Now!

3,000.00Add to cart

కోర్సు సంబంధిత వీడియోలు

పరిభాషా ప్రకరణము కోర్సు వివరములు

ఆర్ష సాంప్రదాయంలో విద్యలు ఎన్ని

కల్పము అంటే ఏమిటి

కోర్సు గూర్చి విద్యార్థుల అభిప్రాయములు

ప్రతాపగిరి పవన్ కుమార్ శర్మ

ముష్టి పవనకుమార్ శర్మ గారు చాలా  సవివరంగా తెలియచేశారు. చాలా కొత్త విషయాలను నేర్చుకున్నాము.

నేమాని కిరణ్ కుమార్

మూర్తి మరువాడ

శ్రీ ముష్టి పవనకుమార్ శర్మ గురువుగారు చెబుతున్న పాఠముల ద్వారా అనగా పరిభాష ప్రకరణము, అగ్ని ముఖము తరగతులు ద్వారా మేము ఎన్నో కొత్త విషయాలు సూత్రానుగుణంగా తెలుసుకున్నాము. ఇలాగే మిగిలిన ఆపస్తంబ సూత్రం మొత్తానికి తరగతులు నిర్వహించి పూర్తి చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఈ తరగతులు శాస్త్రం తెలుసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. సంస్థ వారికి, గురువు గారికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను.

పాకాల వంశీకృష్ణ

కొంపెల్ల శ్రీనివాస్ శర్మ

అభిషేక్ శర్మ

చాలా విషయాలు చాలా చక్కగా శాస్త్ర ప్రమాణంగా తెలియజేశారండి. ధన్యవాదాలు!