సూర్యుడు, తల్లిదండ్రులు ఎట్లైతే ప్రత్యక్షదైవములో అట్లే అగ్నిదేవుడున్నూ. మన వైదికక్రతువులలో ఆయనకున్న ప్రశస్తి మరొకరికి లేదంటే అతిశయోక్తి కాదు. దేవతలందరకూ ఆహుతులను అందిచేవాడు గాన ఆయనకు హుతవహుడు అని పేరు. అట్లే ‘అగ్నిముఖాః వై దేవాః’ అనెడి ఉక్తి ద్వారా దేవతలకు అగ్నిముఖులు అనగా అగ్నినే ముఖముగా కలిగినవారు అనే ప్రసిద్ధి కలిగినది.
అట్టి అగ్నిని మనమెట్లు వైదికక్రతువులకు అంగముగ ప్రతిష్ఠించవలెనో ఎట్లు పూజించి వైదికక్రతువుల సంపూర్ణఫలములను పొందవలెనో తెలిపెడి విధానమే ఆపస్తంబగృహ్యసూత్రములలో ‘అగ్నిముఖము’ లేదా ‘షట్పాత్రప్రయొగము’ గ ప్రసిద్ధము.
అట్టి అతిముఖ్యమైన ప్రకరణమును డా॥ ముష్టి వేంకట పవన కుమార శర్మ గారి అధ్యాపకత్వం లో జులై 15వ తారీఖు నుండి మొదలుపెట్టడానికి శ్రీకామేశ్వరీ ఫౌండేషన్ అన్నీ ఎర్పాట్లు చేస్తున్నది.
ప్రతీ పౌర్ణమి, అమావాస్య, పాడ్యమి, అష్టమి తిథులలో సా|| 4.00 నుండి 5.30 వరకు ZOOM ద్వారా పాఠములు జరుగును.
Course Features
- Lectures 31
- Quizzes 0
- Duration Lifetime access
- Skill level All levels
- Language Telugu
- Students 46
- Certificate No
- Assessments Yes