ఆపస్తంబగృహ్యసూత్ర సమీక్షణం – షట్పాత్రప్రయోగము
అగ్నిని మనమెట్లు వైదికక్రతువులకు అంగముగ ప్రతిష్ఠించవలెనో; ఎట్లు పూజించి వైదికక్రతువుల సంపూర్ణఫలములను పొందవలెనో తెలిపెడి విధానమే ఆపస్తంబగృహ్యసూత్రములలో ‘అగ్నిముఖము’ లేదా ‘షట్పాత్రప్రయోగము’ గా ప్రసిద్ధి పొందినది. ఆ విషయములను గూర్చి సువిస్తారముగా డా॥ ముష్టి వేంకట పవనకుమార శర్మ గారిచే బోధింపబడిన పాఠ్యాంశ తరగతుల ద్వారా తెలుసుకొనగలరు.
కోర్సు ముఖ్యోద్దేశ్యము
దేవతలందరకూ ఆహుతులను అందించేవాడు గాన అగ్నిదేవునకు “హుతవహుడు” అని పేరు. అట్లే ‘అగ్నిముఖాః వై దేవాః’ అనెడి ఉక్తి ద్వారా దేవతలకు అగ్నిముఖులు అనగా అగ్నినే ముఖముగా కలిగినవారు అనే ప్రసిద్ధి కలిగినది.
సనాతన ధర్మమునందు అగ్ని ఆరాధనకి ఎనలేని ప్రాశస్త్యం కలదు.యజ్ఞ,యాగాదులు చేయటం ద్వారా మానవుని యొక్క సమస్త ఈప్సితములు నేరవేరటమే కాక,ప్రపంచము నందు శాంతి,సౌఖ్యము నెలకొంటాయి.
అటువంటి ఫలితములను పొందాలి అంటే,మనము చేసే ఆరాధన పరిపుష్టముగా,వేదవిహితముగా ఉండాలి.ఈ మధ్య కాలములో చండి హోమములు,గణపతి హోమములు,రుద్ర హోమములు మరియు ఇతర అగ్ని కార్యక్రమములు అనేక చోట్ల చేయబడుతున్నవి.అగ్ని ముఖంగానే దేవతలు హవిస్సులను స్వీకరించి మనని అనుగ్రహిస్తారు.అందుచేత యజ్ఞమునందైన,యాగమునందైనా అగ్ని సంస్కరణం ఎంతో ముఖ్యమైనది.
అగ్ని సంస్కరణం
అగ్ని సంస్కరణ యొక్క ప్రాధాన్యతను మరియు క్రింది ప్రశ్నలకు పూర్తి వివరణను ఈ తరగతుల ద్వారా తెలుసుకొనగలరు.
- అసలు అగ్నిని సంస్కరించటం ఎందుకు?
- ఎలా సంస్కరించాలి?
- యజ్ఞ,యాగాలు నిర్వహించేటప్పుడు మనం చేప్పే మంత్రాలకు,చేసే క్రతువుకు బాహ్యార్థం ఏమిటి?అంతరార్థం ఏమిటి?
ప్రధానాంశములు
- పరిస్తరణాది
- పాత్రప్రయోగః
- అపవాదః
- పవిత్రసంస్కారః
- ప్రణీతాప్రణయనమ్
- బ్రహ్మవరణమ్
- ఆజ్యసంస్కారః
- దర్వీసంస్కారః
- అగ్నేః పూర్వపరిషేచనమ్
- ఇధ్మాధానమ్,ఆఘారహోమాశ్చ
- ఆజ్యభాగహోమౌ
- ప్రధానహోమానన్తరం జయాదీనాం విధానమ్
- అగ్నేరుత్తరం పరిషేచనమ్
- పాకయజ్ఞశబ్దార్థః
కోర్సు ప్రయోజనము
ఈ పాఠ్యాంశములను తెలుసుకోవటం ద్వారా షట్పాత్రమును మరింత శ్రద్ధతో ఆచరించి తద్వారా యజ్ఞపురుషుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులు కాగలము.మన భావి తరాలకు కూడా ఈ జ్ఞానసంపదను అందజేయగలుగుతాము.
కోర్సు సంబంధిత వీడియోలు
షట్పాత్రప్రయోగము కోర్సులో చెప్పబడు విషయముల వివరణ
షట్పాత్రప్రయోగము కోర్సు అధ్యయన ప్రక్రియ వివరణ
కోర్సు గూర్చి విద్యార్థుల అభిప్రాయములు
ప్రతాపగిరి పవన్ కుమార్ శర్మ
ముష్టి పవనకుమార్ శర్మ గారు చాలా సవివరంగా తెలియచేశారు. చాలా కొత్త విషయాలను నేర్చుకున్నాము.
నేమాని కిరణ్ కుమార్
మూర్తి మరువాడ
శ్రీ ముష్టి పవనకుమార్ శర్మ గురువుగారు చెబుతున్న పాఠముల ద్వారా అనగా పరిభాష ప్రకరణము, అగ్ని ముఖము తరగతులు ద్వారా మేము ఎన్నో కొత్త విషయాలు సూత్రానుగుణంగా తెలుసుకున్నాము. ఇలాగే మిగిలిన ఆపస్తంబ సూత్రం మొత్తానికి తరగతులు నిర్వహించి పూర్తి చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఈ తరగతులు శాస్త్రం తెలుసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. సంస్థ వారికి, గురువు గారికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను.
పాకాల వంశీకృష్ణ
కొంపెల్ల శ్రీనివాస్ శర్మ
సోమయాజి
అభిషేక్ శర్మ
చాలా విషయాలు చాలా చక్కగా శాస్త్ర ప్రమాణంగా తెలియజేశారండి. ధన్యవాదాలు!